Saturday, December 8, 2007

జూ|| జంద్యాల

మొన్నామధ్య హీరో చిరంజీవి నటించిన ఒక పాత సినిమా చూసా. పేరు చంటబ్బాయ్. అందరికీ తెలిసే వుంటుంది, ఆ సినిమా లో శ్రీలక్ష్మి ది కవితలు చెప్పి జనాలని హింసించే ఒక విలక్షణమైన పాత్ర. కాని ఆ పాత్ర పండించిన హాస్యం అంతా ఇంతా కాదు. ఒక సందర్భం లో ఆవిడ చెప్పే ఒక కవిత జీవన సారాన్ని చెప్తునే హాస్యం పండిస్తుంది. ఆ కవిత ..

"పుట్టేటప్పుడు మనిషికి జీవకళ


చచ్చేటప్పుడు మనిషికి ప్రేత కళ

మధ్యలో ఈ షోకులెందుకే శశికళ

నువ్వు కూడా వినవే చంద్రకళ"

వినటానికి కొంచెం ఎబ్బెట్టుగాను హాస్యం గాను వున్నా నాకు ఎందుకో ఈ కవిత బాగా నచ్చింది.
బాధని కోపాన్ని కూడ సున్నితమైన హాస్యం తో మిళితం చేయటం మహానుభావుడు జంద్యాల గారికే చెందింది. ఆయన సినిమాలన్నీ ఆణిముత్యాలే అంట కదా అని అడిగితే తెలుగు ఇంటిలో అప్పుడే పుట్టిన పాపయి కూడ "నిజమే రా అక్కుపక్షీ" అని తిట్టి మరీ చెపుతుంది. సినిమాలో బూతు లేకుండా తీయటం వీలు కాని పరిస్థితులలో వున్నప్పుడు కూడా, సున్నితమైన హాస్యాన్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆస్వాదిస్తారని నిరూపించిన వారు శ్రీ జంద్యాల.


ఇంతకీ ఈ ఉపోద్ఘాతం అంతా దేనికి అంటే నా చిన్నప్పుడు నేను కవితలు రాయటం మొదలు పెట్టిన కొత్తల్లో మా ఫ్రెండ్ పి.పట్టభిరాం అని, నన్ను వేమన పద్యాన్ని తలపించేలాగ తన పేరు కలిపి ఒకటి చెప్పమన్నాడు. నేను కొంచెం ఎక్కువ స్పందించి వేమన పద్యాన్నే రీమిక్స్ చేసాను. అది ఉప్పు కప్పురంబు పద్యం. ఐతే అది పొరపాటున మా తెలుగు టీచర్ కంట్లో పడింది. ఆవిడ అది తరగతి లో అందరికీ వినిపించి నా చెవులకు మెలి పెట్టారు, పద్యాన్నిఅవహేళన చేసినందుకు. కాని నాకు మాత్రం చాల ప్రసంశలు వచ్చాయి క్లాసు లోంచి. నాకు జూ జంద్యాల గా ఒక బిరుదు కూడ ఇచ్చాడు మా పట్టభి గాడు. ఆ పద్యం ఏంటంటె ...

"ఉప్పు లేని పప్పు చప్ప చప్పగనుండు

చప్ప పప్పు తిన్న తిప్పలుండు

పప్పు లో తగినంత ఉప్పును వేయరా

సకల గుణాభి రామ, పి. పట్టాభి రామా."

6 comments:

Unknown said...

jaMjyala gaari chaMdrakala gurtuchEsaaru ...

mIku dhanyaavadaalu .....

ju jandhyala

రాధిక said...

సూపర్ గా చెప్పారు.చిన్నప్పుడేనా ఇప్పుడు కూడా ఆసువుగా చెపుతున్నారా?

చదువరి said...

పద్యం బాగుంది పట్టాభిరామా!

బ్లాగేశ్వరుడు said...

పద్యం బాగుంది పట్టాభిరామా

Rajendra Devarapalli said...

పజ్జెం బాగుంది జంద్యాలను స్ఫూర్తిగా తీసుకోండి,కానీ స్వతంత్ర రచనలు చేయండి.బూతు లేకుండా సినిమా తీయాలని కామెడిలో
హాస్యం లేకుండా చాలా సినిమాలు తీయాల్సొచ్చింది జంధ్యాలకు.దర్శకుడిగా విపరీతమయిన తడబాటుకు జంధాల గురయిన సినిమా చంటబ్బాయ్ అది మల్లాది నవలా కాదు,జంధ్యాల దర్శకత్వమూ కాదు,చిరంజీవి సిన్మా కూడా కాదు. మరేదో

Nrahamthulla said...
This comment has been removed by a blog administrator.