ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.
మానవ జన్మ ఒక వరం. ఏ యితర జీవికి లేని విచక్షణ జ్ఞానం, మనిషికి మాత్రమే వుండటం ఒక అదృష్టం.ఒక మనిషి అంతర్గత జీవనాన్ని, బాహ్య ప్రపంచంతో సమతుల్యం చేసే ప్రక్రియే కళ. సృష్టి ఆవిర్భావం మొదలు ఈ ప్రక్రియ నిరంతరంగా సాగుతూనే వుంది. ఈ ప్రక్రియకు కొలమానం వుండదు. ఎప్పటికప్పుడు దాని అవధులు పొడిగించబడతాయి. కాబట్టే కొత్తదనానికి లోటు లేదు. ఒక్కోసారి ఈ కళార్తి ఒక మనిషి జీవిత విధానన్నే మారుస్తుంది.
సంగీతం, సాహిత్యం, నృత్యం, చిత్రలేఖనం మరియు శిల్పకళ అనబడే ఈ ఐదు కళా రూపలను మనవ జీవన సరళి కి అన్వయించుకునే ప్రక్రియకు నేను సైతం ఒక సమీకరణాన్ని కూర్చటానికి చేసే ఒక ప్రయత్నమే ఈ "పంచవటి".
ఇందులో ముఖ్య భాగం కథా సంపుటి. కొన్ని నిజజీవితపు సంఘటనలు, కొన్ని కల్పితాలతో కొంత హాస్యం మరికొంత వ్యగ్యం మిళితం చేసి మానవ మానసిక స్థాయీబేధాలను (human psychological levels) ప్రతిబింబించే రీతిలో కృషి చేయడమైనది. ఇవి వారానికి రెండు కధల చొప్పున ప్రచురింపబడతాయి. ఇంకా సంగీత, నృత్యానికి సంబంధించినంత వరకు ఆయా రంగాలలో ప్రముఖుల కృషి మొ ప్రచురించ పడతాయి.
సాహిత్యానికి కలికితురాయి కవిత్వం. ఒక్కొ సారి ఒక్కో విధంగా కవిత్వం పుడుతుంది. అలా ఆశువు గా వచ్చే కవితలె మనసుకు హత్తుకుంటాయి. కాబట్టి ఈ బ్లాగులో ఆశు కవిత్వానికి ప్రాధాన్యత ఇవ్వబడింది.
నా లో ఈ సాహితీ స్పృహ కి కారకులైన నా అమ్మకి నాన్నకి, ఈ ప్రయత్ననికి నాకు స్ఫూర్థిని యిచ్చిన శ్రీ నాగరాజు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
1 comment:
స్వాగతం చక్రి.
టపాలన్నీ చాలా బాగున్నాయి.
మీరు ఈ బ్లాగు లంకెని తెలుగుబ్లాగు గూగుల్ గుంపులో పెట్టండి - అప్పుడు, ఇది కూడలి, తేనెగూడు వాటిల్లో వస్తుంది. తెలుగు బ్లాగర్లందరూ - కూడలి, తేనెగూడు ద్వారానే తెలుసుకొంటారు.
http://groups.google.co.in/group/telugublog
http://koodali.org/
http://thenegoodu.com/
--నాగరాజు
Post a Comment